విశాఖపట్నం: ఐఎన్‌ఎస్ డేగా వద్ద కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమాన భద్రతా విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ అప్పలకొండ గాయపడ్డారు.
తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో బుల్లెట్ ఆయన ఎడమ ఛాతి కింది భాగంలో తగిలినట్లు సమాచారం. పెద్ద శబ్దం వినిపించడంతో అక్కడున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై అప్పలకొండను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: