Tv424x7
Andhrapradesh

రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రం

కర్నూలు జిల్లాలో వజ్రాల వేటలో రైతు సక్సెస్ అయ్యారు.. పొలం పనులు చేస్తున్న సమయంలో ఆయనకు ఓ వజ్రం దొరికింది. వెంటనే వ్యాపారులు వేలంపాట నిర్వహించగా భారీ ధరకు ఓ వ్యాపారి దక్కించుకున్నారు. డబ్బులు, బంగారాన్ని ఆ రైతుకు చెల్లించి వజ్రాన్ని వ్యాపారి దక్కించుకున్నారు. కర్నూలు జిల్లా ఒక్కటే మాత్రమే కాదు అటు అనంతపురం జిల్లాలోని పొలాలు, స్థలాల్లో కూడా ఈ వజ్రాల వేట కొనసాగుతోంది.కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. గత వారం రోజులుగా జనాలు పొలాల్లో వజ్రాల కోసం గాలిస్తున్నారు.. ఈ క్రమంలో ఓ రైతును అదృష్టం వరించింది. పొలంలో పనులు చేస్తుండగా ఓ వజ్రం దొరికింది.. జీవితమే మారిపోయింది. కర్నూలు జిల్లా మద్దెకర మండలం హంప గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేసుకుంటున్నాడు. అతడికి పొలంలో ఓ వజ్రం దొరకగా.. పెరవలికి చెందిన వ్యాపారి వేలం పాటలో రూ.5 లక్షలు, రెండు గ్రాముల బంగారం రైతుకు ఇచ్చి ఆ వజ్రాన్ని దక్కించుకున్నాడు. అయితే బయట మార్కెట్‌లో ఆ వజ్రం విలువ ఇంకా ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Related posts

విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ని టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ని ఘనంగా సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు

TV4-24X7 News

ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు: ప్రకాశ్ రాజ్

TV4-24X7 News

దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుంది.. రాష్ట్రపతి ముర్ము

TV4-24X7 News

Leave a Comment