కొండగట్టులో ఆర్జిత సేవలు బంద్ జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఈ నెల 29 బుధవారం నుండి జూన్ 2 ఆదివారం వరకు అన్ని రకముల ఆర్జిత సేవలు నిలిపి వేయబడ్డాయనిఈవో చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 శుక్రవారం ఉదయం నుండి జూన్ 2 ఆదివారం సాయం కాలం 4. 30 వరకు విరామం లేకుండా దర్శనం కల్పించబడునన్నారు.

previous post