జమ్మలమడుగు ఆర్టీసీ బస్ స్టేషన్, మైలవరంలోని బస్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న స్టాల్స్ స్థలాల్లో వ్యాపారాలు నిర్వహించుటకు సీల్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ పీవీ ప్రవీణ్ తెలిపారు. డిపో కార్యాలయంలో 14 నుంచి 27వ తేదీ వరకు టెండర్ ఫారాలు ఇస్తారని, వాటిని 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డీపీటీఓ ఆఫీస్ కడప కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెండర్ బాక్స్లో వేయాలన్నారు.
