విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఇంధీరా ప్రియ దర్శిని మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రో కిక్ బాక్సింగ్ రెండవ లీగ్ మ్యాచ్ నిర్వహించిన టెంకు దుర్గా ఆధ్వర్యంలో జరుగుతున్న స్టేట్ కిక్ బాక్సింగ్ లీగ్ మ్యాచ్లో కి ముఖ్య అతిధిగా 35 వ వార్డ్ కార్పొరెటర్ విల్లూరి భాస్కర రావు విచ్చేయడం జరిగినది ఈ పోటీల్లో అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొని కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది వారు మాట్లాడుతూ క్రీడాకారుల కోసం నిర్మించిన. ఈ ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం ప్రో కిక్ బాక్సింగ్ పోటీలు ఈ స్టేడియం లో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని క్రీడాకారులు అందరు కూడా మన రాష్ట్ర దేశ కీర్తిని ఖ్యాతిని అన్ని వైపులా వ్యాపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా క్రీడల్లో రాణించాలని ఆయన మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమo లో తెలుగుదేశం పార్టీ 35వ. వార్డ్ అధ్యక్షులు బుచ్చ రాము మరియు 35 టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
