Tv424x7
Telangana

సాధారణ ప్రసవాలు చేసిన నర్సులకు ప్రోత్సాహకాలు*

హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతోపాటు పుట్టిన వెంటనే శిశువులకు తల్లిపాలు పట్టించడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్న నర్సులు, నర్సింగ్ ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహకాలను ప్రకటించింది. సంవత్సరానికి 100 సాధారణ ప్రసవాలను చేసిన వారికి ప్రోత్సహాకాలను అందిస్తున్నట్లు ప్రత్యేక సర్క్యలర్ ను జారీ చేసింది.ఇందుకు రాష్ట్రంలోని 35 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్ స్టాఫ్ కు ఇన్సెంటివ్స్ ను విడుదల చేసింది. పుట్టిన వెంటనే తల్లిపాలను పట్టించిన నర్సులకు ప్రతి శిశువుకు రూ.200 ప్రోత్సాహకంగా ప్రకటించింది. 92 డెలివరీ పాయింట్ల ప్రాతిపదికన ప్రోత్సహాకాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు.

Related posts

అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

TV4-24X7 News

కొయ్యడ వెంకటేష్ ని . కొండపాక మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినియామక పత్రం

TV4-24X7 News

చార్మినార్ దగ్గరకు కేటీఆర్..

TV4-24X7 News

Leave a Comment