Tv424x7
Telangana

పేద విద్యార్థి ఉన్నత చదువులకు ఎంపీ డా. కడియం కావ్య , ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆపన్నహస్తం

పేద విద్యార్థి ఉన్నత చదువులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి గారు అండగా నిలిచారు. వేలేరు మండలం, మల్లికుదుర్ల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వీరారెడ్డి కుమారుడు మనిర్వేశ్ రెడ్డి ఎంసెట్ లో ర్యాంక్ సాధించి, కిట్స్ వరంగల్ సివిల్ ఇంజనీరింగ్ లో సీటు సాధించారు. కాలేజీ ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో విషయం తెలుసుకున్న ఎంపీ డా. కడియం కావ్య గారు , ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, విద్యార్ధి ఉన్నత చదువులను ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయం అందజేశారు. గతంలో కడియం ఫౌండేషన్ ద్వారా మనిర్వేశ్ రెడ్డి చదువులకు ఆర్ధికంగా అండగా నిలిచిన ఎంపీ డా. కడియం కావ్య గారు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ….ఉన్నతమైన చదువులు చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని వారు విద్యార్ధికి సూచించారు. మంచి పేరు తెచ్చుకోవాలని, ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కాలేజీ ఫీజుకు ఆర్థిక సహాయాన్ని అందించిన ఎంపీ డా. కడియం కావ్య గారికి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి మనిర్వేశ్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోదేలా రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్… నేడు భారీ వర్షాలు..

TV4-24X7 News

అదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు…! పలుచోట్ల వరదకు కొట్టుకుపోయిన రోడ్లు

TV4-24X7 News

వినాయక లడ్డూ వేలం!రెక్కలు తాకిన ధరలు… ఎంతో తెలుసా….

TV4-24X7 News

Leave a Comment