Tv424x7
Andhrapradesh

శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి దంపతులు కి ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానం

టౌన్ కొత్త రోడ్డులో వేంచేసియున్న శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం రథయాత్ర మహోత్సవాలు ఈరోజు మహా అన్నదానం కార్యక్రమంతో దిగ్విజయంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు డీ.హరీష్ , కె.ఈశ్వరమ్మ , ఎస్. రామకృష్ణ , పి.శ్రీధర్ , జె.పరశురాం , ఆర్.వెంకటేష్ , కె. మణికుమార్ , యు.ఆదిలక్ష్మి , జి.సుశీల , ఆలయ ఈఓ టి రాజగోపాల్ రెడ్డి మరియూ గాయత్రి దంపతులని, అర్చకులు సురేష్ బాబుని, ఉత్సవాలని ఘనంగా అందరినీ కలుపుకుంటూ పూర్తిచేసినందుకు ఫ్రూట్స్ బొకే అందించి సాలువా కప్పి సన్మానించారు. ఉత్సవ కమిటీ సభ్యులందరూ వారి పూర్తి సహాయ సహకారాలను అందచేసినందుకు ఆలయ ఈవో కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలలో ఉత్సవ కమిటీ సభ్యులుగా అవకాశమిచ్చిన దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ కి, కమిటీ సభ్యులంతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మరియు టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇంచార్జి సీతంరాజు సుధాకర్ కి, విశాఖ జిల్లా ఉపాధ్యక్షలు కోప్పల రామ్ కుమార్ కి కూడ కమిటీ సభ్యులంతా అభినందనలు తెలిపారు.

Related posts

ఏపీలో నాలా చట్టం రద్దు …

TV4-24X7 News

రాజకీయాల్లో ‘పవన్’ అస్త్రం!

TV4-24X7 News

జీతాలు జూలై లో పెంచుతాం విధుల్లో చేరకుంటే కొత్తవారిని తీసుకుంటాం: సజ్జల

TV4-24X7 News

Leave a Comment