Tv424x7
Andhrapradesh

వెంకటేశ్వర మెట్ట వద్ద గల బలిగిరి వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలయ శుద్ధి కార్యక్రమంలో విశాఖ జనసేన సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం ఆలయాలు లో ఆధ్యాత్మిక శోభ వెదజల్లెలా తీర్చిదిద్దాలి పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రమైన దరిమిల ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా ఈరోజు వెంకటేశ్వర మెట్ట వద్ద గల బలిగిరి వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుద్ధి కార్యక్రమంలో విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు, సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం లో సంప్రోక్షణ చేసి, శుద్ధి చేశారు. తిరుమల లడ్డు వార్త ప్రపంచం లో ఉన్న భక్తులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు.రాష్ట్రం లో అనేక దేవాలయాల తో పాటు , సింహాచలం దేవాలయం లో వైసిపి నిర్లక్ష్య వైకిరి బయటపడిందని అన్నారు. దేవాలయాల ను ఆధునీకరణ చేసి, ఆధ్యాత్మిక శోభ వెదజల్లే లా తీర్చిదిద్దాలి అని అన్నారు. కార్యక్రమంలో టిడిపి ,జనసేన, బిజెపి రాష్ట్ర నాయకులు, కార్పొరేటర్లు, ఇన్చార్జి లు, వార్డ్ అధ్యక్షులు,కూటమి నేతలు పాల్గొన్నారు.అనంతరం 34 వార్డ్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం లో పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కి ఆలయ కమిటీ సభ్యులు గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు, స్థానిక నాయకులు, టిడిపి ,జనసే,న బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

దీపావళి ఏ రోజున జరుపుకోవాలి..? అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..!!

TV4-24X7 News

ఉచితంగా డిజిటలైజ్ చేసి 173 బండిల్స్ లో గల 288 తాళపత్ర గ్రంథాలను సిపి బ్రౌన్ గ్రంథాలయానికి తిరిగి అప్పగింత

TV4-24X7 News

ఈ నెల 9 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

TV4-24X7 News

Leave a Comment