విశాఖ దక్షిణం జనసేనాని పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తి తో, జికె ఫౌండేషన్ పలు సేవా కార్యక్రమాల్లో నిత్యం చేస్తూనే వుంటుంది. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు లో నివసిస్తున్న కడితి మంగంధ వర్ధన్ అను 10 సంవత్సరాల బాలుడు క్యాన్సర్ వ్యాధితో పోరాడుతుండడంతో, వైద్య ఖర్చుల నిమిత్తం 10నెలలుగా నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ నెల నిమిత్తం 2024 నవంబర్ న 10వ నెల వెయ్యి చెక్ ను (మొత్తం 10వేలు ) వారి కుటుంబానికి ఫౌండేషన్ చైర్మన్ మరియు సభ్యులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 33వ వార్డు అధ్యక్షులు ఆకుల రాజు 34వ వార్డు అధ్యక్షులు నీలం రాజు మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
previous post

