Tv424x7
Andhrapradesh

మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ: కొల్లు రవీంద్ర

అమరావతి: కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలను పెంచలేదని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో కొత్త మద్యం విధానంపై మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు..గతంలో కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు. ” మేం వచ్చాక పారదర్శకంగా మద్యం దుకాణాలు కేటాయించాం. మేం తీసుకున్న చర్యలతో ప్రభుత్వానికి రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చింది. గత ప్రభుత్వంలో రూ.1,800 కోట్ల అవినీతి జరిగింది. నాణ్యమైన మద్యాన్ని మాత్రమే అందుబాటులోకి తెచ్చాం. కొత్త మద్యం విధానం అనుసరించి మద్యం ధర తగ్గించాం. గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ జరుపుతాం. అక్రమార్కుల అందరిపైనా చర్యలు తీసుకుంటాం” అని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు..

Related posts

ఏపీలో 108, 104 సిబ్బంది సమ్మె

TV4-24X7 News

నకిలీ ఉపాధ్యాయ నియామకాలతో రూ. 2 కోట్ల మోసం!!

TV4-24X7 News

పాక్‌లో పుట్టి ఆ దేశ పౌరసత్వం ఉన్న అమ్మాయి.. 19 ఏళ్లుగా ధర్మవరంలోనే..

TV4-24X7 News

Leave a Comment