Tv424x7
Andhrapradesh

వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై సెర్చ్ వారెంట్

పులివెందుల: వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై పోలీసులు సెర్చ్ వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలం అంబకపల్లిలోని రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసు అంటించారు..ఏ క్షణంలోనైనా ఇంట్లో సోదాలు చేయడానికి అనుమతి తీసుకున్నామని వారు తెలిపారు. వారం రోజుల నుంచి రాఘవరెడ్డి పరారీలో ఉన్నాడు. మరోవైపు వైకాపా సోషల్‌ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డికి పోలీసుల 41-ఎ నోటీసులు జారీ చేశారు..వైఎస్‌ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇచ్చిన కంటెంట్‌నే తాను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశానని వర్రా రవీందర్‌రెడ్డి ఇటీవల పోలీసులకు తెలిపారు. ఈ మేరకు రాఘవరెడ్డి కోసం అతడి స్వగ్రామం అంబకపల్లెలో నిఘాపెట్టి, పులివెందుల, లింగాల మండలాల్లో గాలిస్తున్నారు..

Related posts

ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 7, 502 క్యూసెక్కుల నీరు విడుదల

TV4-24X7 News

ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా లక్ష్యం: లోకేశ్‌

TV4-24X7 News

యువకుల చేతుల్లో మత్తు పదార్థాలు స్వాధీనం..

TV4-24X7 News

Leave a Comment