Tv424x7
Andhrapradesh

దువ్వూరు మండల మదిరేపల్లెలో ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

కడప/మైదుకూరు: దువ్వూరు, 2 సెప్టెంబర్ 2025:దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మదిరేపల్లె గ్రామ పంచాయతీ లో ఘన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని EX PACSS నాయకుడు నారుపల్లి అంకిరెడ్డి ఆధ్వర్యం వహించారు.గ్రామ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైయస్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. వైయస్ గారి ప్రజల కోసం చేసిన సేవలు, ఉచిత విద్యుత్, మహిళలకు పావలా వడ్డీ, జలయజ్ఞం, పిల్లలకు పీజు రీంబర్స్‌మెంట్, పేదలకు సబ్సిడీ బియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు, ఆరోగ్యశ్రీ సేవలు, 108, 104 అత్యవసర సేవల గురించి గుర్తు చేసుకున్నారు.గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి నారుపల్లి నాగ శిరీష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానికులు వైయస్ గారి స్మరణార్థం మాట్లాడుతూ,”ఎలా మరచిపోగలరు నిన్ను… మా మనస్సులో చిరస్థాయిగా మిగిలిపోతావు… మరణంలేని మహానియుడు” అని పేర్కొన్నారు.కార్యక్రమం చివర, ప్రజలు వైయస్ సేవలను స్మరించి, ఆయన కోసం మనస్సులో కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

యూటైల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నేషనల్ వైస్ చైర్మన్ జి. చిట్టిబాబు ఆధ్వర్యంలో డాll బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుక

TV4-24X7 News

వివేకా హత్య కేసు.. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత

TV4-24X7 News

ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

TV4-24X7 News

Leave a Comment