Tv424x7
AndhrapradeshPolitical

ఎన్నికల కోసమే సీఎం జగన్‌ ప్రారంభోత్సవ నాటకాలు: అచ్చెన్నాయుడు

అమరావతి: ఉద్దానం కిడ్నీ బాధితులను అన్ని విధాలుగా ఆదుకున్నది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) తెలిపారు..ఉద్దానంలో (uddanam) కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం భూమి కేటాయించడంతో పాటు పనులు కూడా మొదలుపెట్టిందని గుర్తు చేశారు. ఏడాదిలో పూర్తికావాల్సిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులను 4 సంవత్సరాల 7 నెలలైనా.. ఇంకా పూర్తికాలేదన్నారు. సీఎం జగన్ ఎన్నికల కోసం ప్రారంభోత్సవ నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ విషయంలో అంతా తానే పూర్తి చేసినట్లు సీఎం అసత్యాలు చెబుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు..”తెదేపా హయాంలో 6 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తే వాటిని కూడా నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డిది. సురక్షిత తాగునీరు ఇచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలో 175 ప్లాంట్లను ఏర్పాటు చేస్తే వాటినీ నిర్వీర్యం చేశారు. రూ.700 కోట్ల విలువైన సుజల ధార ప్రాజెక్టుకు మొత్తం నిధులు వైకాపా ప్రభుత్వమే వ్యయం చేసినట్టు జగన్ వ్యవహరిస్తున్నారు. ఉద్దానంలో రోగులకు వైద్యం సరిగా అందడం లేదు. వారికి కావాల్సిన మందులు అరకొరగా అందిస్తున్నారు. కావాల్సిన మేర వైద్యులు అందుబాటులో లేరు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రోగులకు అందుతున్న వైద్య సేవలూ అంతంతమాత్రమే. ఉద్దానం బాధితులకు చంద్రబాబు ప్రయోజనకరమైన పనులు చేశారు. కానీ జగన్ రెడ్డి కొసరు పనులతో బిల్డప్ ఇస్తున్నారు. ఎన్నికల స్టంట్లు చేస్తూ ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారు” అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు..

Related posts

ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ

TV4-24X7 News

తిరుపతిలో కిడ్నాప్ కలకలం…

TV4-24X7 News

మళ్లీ జగన్ వస్తే..? టీడీపీ భయపడుతోందా.?

TV4-24X7 News

Leave a Comment