Tv424x7
Andhrapradesh

ఉద్యమ శిబిరంలో ఆగిన గుండె – రైతు మరణంపెందుర్తి, విశాఖపట్నం..

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పొర్లుపాలెం గ్రామంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి భూములు ఇచ్చి, ప్రభుత్వం వాగ్దానం చేసిన పరిహారం కోసం ఆరు నెలలుగా ఉద్యమ శిబిరంలో దీక్ష పెట్టి పోరాటం చేసిన రాపర్తి చంద్రరావు (55) ఆదివారం కుప్పకూలి మృతి చెందారు.

చంద్రరావు 10 సెంట్ల భూమిని కోల్పోయి అద్దె ఇంట్లో జీవనం సాగించేవారు. చిన్న కుమార్తె వివాహం కోసం పరిహారం కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఆందోళనలో ఉన్న ఆయన, ఉద్యమ శిబిరంలోనే కన్నుమూశారు.

రైతు సంఘాల నేతలు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించి, కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికులు ఈ ఘటనకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Related posts

డ్రగ్స్ దందా చేస్తున్న ఏపీ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

TV4-24X7 News

అక్టోబర్ లో థియేటర్లలోకి మళ్ళీ.. రీ రిలీజ్ కాదు.. అసలు ట్విస్ట్ ఇదే..!

TV4-24X7 News

ఫిబ్రవరి 15 నుండి ఎమ్మెల్యే రాచమల్లు ఎన్నికల ప్రచారం

TV4-24X7 News

Leave a Comment