నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో సెప్టెంబర్ 9న చోటుచేసుకున్న ఆవుల శ్రీను (44) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
ఒంటరిగా జీవిస్తున్న శ్రీనుకు పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అయితే ఇటీవల ఆ మహిళ మరో వ్యక్తితో అక్రమ బంధం పెట్టుకోవడంతో ఇరువురి మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి.
పాత సంబంధాన్ని అడ్డుగా భావించిన ఆ మహిళ కొత్త ప్రియుడితో కలసి కుట్ర పన్ని, శ్రీనును అతని ఇంటి వరండాలోనే దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది.
పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయి.

