Tv424x7
Andhrapradesh

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానం!!

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభా కార్యక్రమాల విరామ సమయంలో వీరిద్దరూ పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, రాష్ట్రంలో విజయవంతంగా ముగిసిన మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి పవన్ కల్యాణ్‌ను మంత్రి లోకేశ్ ఆహ్వానించారు.

కాగా:

డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు సెప్టెంబర్ 25న అందజేయనున్నారు.

రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది.

మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల తుది జాబితా సెప్టెంబర్ 15న విడుదల అయ్యింది.

ఈ ఏడాది ఏప్రిల్ 20న ప్రభుత్వ, పురపాలక, గిరిజన సంక్షేమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

రాష్ట్రవ్యాప్తంగా 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జులై 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించబడ్డాయి. తరువాత, టెట్ స్కోర్‌కు 20% వెయిటేజీ ఇస్తూ ధృవపత్రాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితా రూపొందించారు.

ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్, విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి.

ప్రభుత్వం నియామక ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా ముగించడంతో, అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమం విశిష్టంగా జరగనుంది.

Related posts

ఉత్తమ పోలీసు సిబ్బందికి రివార్డులు

TV4-24X7 News

APSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

TV4-24X7 News

ఉచిత సిలిండర్ల అమలు అప్పటి నుంచే

TV4-24X7 News

Leave a Comment