Tv424x7
Andhrapradesh

గడివేములలో పిచికారీ డ్రోన్స్ ప్రారంభం!!

నంద్యాల జిల్లా, గడివేముల మండలం – రైతులకు ఆధునిక సాంకేతిక సహాయం అందించడానికి గడివేముల మండలంలో రెండు కొత్త పిచికారీ డ్రోన్లు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరిత్ మాట్లాడుతూ, డ్రోన్ల వినియోగం ద్వారా రైతులు పొలాలలో మందు పిచికారీని సులభంగా, త్వరగా నిర్వహించగలరని తెలిపారు.

ఎమ్ఎల్ఏ గారు రైతులకు సబ్సిడీ సౌకర్యంలో డ్రోన్లను అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరికరాల వినియోగం వల్ల గడ్డి, పంటలకు నష్టం తగ్గి, వ్యవసాయం మరింత సమర్థవంతంగా సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రైతులు ఈ నూతన సాంకేతిక సౌకర్యాన్ని వినియోగించుకుని సమయం, ఖర్చు ఆదా చేసుకోవాలని, పంట దిగుబడులు పెంచుకోవాలని ఎమ్మెల్యే గారు సూచించారు.

Related posts

నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..

TV4-24X7 News

కరెంట్‌ షాక్‌తో మరణిస్తే 5 లక్షలు పరిహారం-నెల రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి

TV4-24X7 News

భూమా మౌనిక రాజకీయ ఎంట్రీపై జోరుగా ప్రచారం.. నిజమేనా..?

TV4-24X7 News

Leave a Comment