Tv424x7
Telangana

పర్యాటక శాఖలో జూనియర్ అకౌంటెంట్ బాగోతం: రూ.1.05 కోట్లు ప్రియుడి ఖాతాలో!

హైదరాబాద్: పర్యాటక శాఖలో జూనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శ్రుతి అనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని రూ.1.05 కోట్ల ప్రభుత్వ నిధులను తన ప్రియుడి ఖాతాకు మళ్లించిందని అధికారులు తెలిపారు. ఈ బాగోతం 27 నెలలపాటు కొనసాగింది.

శ్రుతి ప్రతి నెల వేతనాలు చెల్లించే సమయంలో కొన్ని మొత్తాలను వెండర్ పేరుతో దారి మళ్లించిందని, ఆ తర్వాత ఔన్‌లైన్ చెల్లింపుల్లో అదనంగా ఒక ఉద్యోగి పేరును చేర్చి నిధులు డ్రా చేసినట్లు పరిక్షణలో వెల్లడయింది. ఇందులో రూ.80 లక్షలు ఒకే ఖాతాలో జమ అయ్యాయి.

ఏజీఎంల నిర్లక్ష్యం కారణంగా ఇది గమనించబడలేదు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎడీ వారీగా లెక్కలు పరిశీలించినపుడు అవకతవకలు బయటపడ్డాయి.

శ్రుతిపై కేసు నమోదు చేయగా, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఏజీఎంలను సస్పెండ్ చేయడంతో పాటు, నిధులను రికవరీ చేయాలని ఎండీ వల్లూరు క్రాంతి ఆదేశాలు జారీ చేశారు.

పర్యాటక శాఖలో ఉద్యోగుల డ్యూటీ చార్ట్ సరిగా లేకపోవడం, విభాగాల మార్పులు చేపట్టకపోవడం వంటి కారణాలు ఈ బాగోతానికి దారితీసినట్లు అధికారులు తెలిపారు.

Related posts

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో భారీ డ్రగ్స్ పట్టివేత..

TV4-24X7 News

గద్వాల – అయిజ రహదారిపై పోలీసుల ఉదారత

TV4-24X7 News

తెలంగాణకు వడగాలుల ముప్పు.. నేడు, రేపు పెరగనున్న ఎండలు

TV4-24X7 News

Leave a Comment