Tv424x7
National

రిజిష్టర్డ్ పోస్ట్ – స్పీడ్ పోస్ట్ కలయికపై కొత్త మార్పులు!!

భారత తపాలా శాఖ రిజిష్టర్డ్ పోష్టును అధికారికంగా స్పీడ్ పోష్టుతో విలీనం చేసింది. అయితే చట్టపరంగా రిజిష్టర్డ్ పోష్టుకు ఉన్న ప్రత్యేకత కారణంగా కొందరు వర్గాల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ప్రస్తుతం కొన్ని చట్టాలలో నోటీసులు రిజిష్టర్డ్ పోష్టు ద్వారా పంపాలి అనే నిబంధన ఉంది. దానికి ప్రధాన కారణం – రిజిష్టర్డ్ పోష్టులో కేవలం ఆ పేరుతో ఉన్న వ్యక్తి చేత సంతకం తీసుకుని మాత్రమే డెలివరీ ఇవ్వడం. ఇది నోటీసు వ్యక్తిగతంగా అందినట్లుగా ధృవీకరణగా పరిగణిస్తారు.

కానీ స్పీడ్ పోష్ట్‌లో మాత్రం ఆ చిరునామాకు ఇవ్వడమే సరిపోతుంది; తప్పనిసరిగా వ్యక్తిగతంగా అందించాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యత్యాసం వల్లే చట్టపరమైన వ్యవహారాల్లో గందరగోళం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తపాలా శాఖ ప్రజల సౌకర్యార్థం 7 రకాల స్పీడ్ పోస్ట్ సేవలను ప్రారంభించింది:

  1. సాధారణ స్పీడ్ పోష్ట్
  2. స్పీడ్ పోష్ట్ + రిజిస్ట్రేషన్
  3. స్పీడ్ పోష్ట్ + OTP ఆధారిత డెలివరీ
  4. స్పీడ్ పోష్ట్ + Proof of Delivery
  5. స్పీడ్ పోష్ట్ + రిజిస్ట్రేషన్ + Proof
  6. స్పీడ్ పోష్ట్ + OTP + Proof
  7. స్పీడ్ పోష్ట్ + రిజిస్ట్రేషన్ + OTP + Proof

ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకోవాలంటే వినియోగదారులు కొద్దిగా అధిక రుసుము చెల్లించవలసి ఉంటుంది.
ఇవి ముఖ్యంగా చట్టపరమైన నోటీసులు, అధికారిక పత్రాలు, కోర్టు సమన్లు వంటి సందర్భాల్లో అత్యంత ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

Related posts

ఐదు గ్యారంటీలు ప్రభుత్వానికి భారమే: కర్ణాటక సీఎం

TV4-24X7 News

జీఎస్టీ సంస్కరణలపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు….

TV4-24X7 News

ఉక్కు మనిషి’కి రాష్ట్రపతి నివాళులు..!!

TV4-24X7 News

Leave a Comment