Tv424x7
National

పెళ్లి చేస్తామని నమ్మించి క్రూరహత్యఉత్తరప్రదేశ్‌లో ప్రేమజంటపై ఘోర దాడి

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఒక ప్రేమజంటపై జరిగిన దారుణం కలకలం రేపుతోంది.స్థానికంగా నివసిస్తున్న దుక్కాన అనే యువకుడు, మున్నీ అనే యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.ఇంట్లో పెద్దలు వీరి ప్రేమను వ్యతిరేకించడంతో, ఇద్దరూ గుజరాత్‌కి వెళ్లి వివాహం చేసుకున్నారు.చెల్లి ఇలాగే పారిపోయిందనే అవమానం భరించలేకపోయిన అన్నలు,“ఊర్లోనే గ్రాండ్‌గా పెళ్లి చేస్తాం” అంటూ మున్నీని, ఆమె భర్తను ఒప్పించారు.వారి నమ్మకంతో మున్నీ, దుక్కాన తిరిగి ఊరికి వెళ్లేందుకు అంగీకరించారు.అయితే, హథినాలా గ్రామం వద్దకు చేరుకున్న తర్వాత“టాయిలెట్‌కి వెళ్దాం” అంటూ జంటను అడవిలోకి తీసుకెళ్లిన అన్నలు —అక్కడే మున్నీతో పాటు ఆమె భర్త దుక్కానను కత్తులతో దారుణంగా హత్య చేశారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, నిందితులుగా మున్నా కుమార్, రాహుల్ అనే ఇద్దరు సోదరులను గుర్తించి అరెస్ట్ చేశారు.ప్రేమజంటను నమ్మించి ఊరికి రప్పించి చంపిన ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

పెళ్లికి ముందు శారీరక సంబంధం గురించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

TV4-24X7 News

గగన్‌యాన్ మిషన్‌‌పై ఇస్రో కీలక అప్‌డేట్ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌

TV4-24X7 News

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా మారే దిశలో , టెస్లా సీఈఓ…

TV4-24X7 News

Leave a Comment