Tv424x7
Telangana

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే – ప్రభుత్వానికి చుక్కెదురు

కోర్టు ఆదేశాల కాపీ వచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ నిర్ణయం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.9పై హైకోర్టు స్టే విధించింది.ఈ జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసిన ప్రభుత్వ నిర్ణయంపై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వాటిని విచారించిన న్యాయస్థానం, తాత్కాలికంగా జీవో అమలును నిలిపివేస్తూ ప్రభుత్వాన్ని నోటీసులు జారీ చేసింది.ప్రభుత్వం తన వాదనలు సమర్పించేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. కోర్టు ఆదేశాల కాపీ అందిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై తదుపరి చర్యల గురించి ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయం తీసుకోనుంది.ఈ పరిణామంతో రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related posts

విద్యుత్ ఉద్యోగుల ఆగ్రహం…ఇదేనా కారణం..

TV4-24X7 News

“బాలల సంరక్షణ కేంద్రంలో అసహ్యం – ఉపాధ్యాయుడి ఘాతుకం బహిర్గతం..

TV4-24X7 News

కన్న కొడుకును కర్రతో కొట్టి చంపిన తండ్రి…. ఎందుకో తెలుసా…

TV4-24X7 News

Leave a Comment