మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల.
జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకును కర్రతో కొట్టి హత్య చేసిన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే—తాగుడుకు బానిసైన శ్రీధర్ (30) తరచూ తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై ఆగ్రహానికి గురైన తండ్రి నాగయ్య తీవ్ర ఆవేశంతో కర్రతో కొట్టి తనయుడిని అక్కడికక్కడే మృతిచెందేలా చేశాడు.
సమాచారం అందుకున్న జడ్చర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, “మద్యపానం వల్లే కుటుంబాలు నాశనమవుతున్నాయి, ఇలాంటి దారుణాలు ఆగాలంటే ప్రభుత్వం, సమాజం కలసి ముందుకు రావాలి” అని అభిప్రాయపడ్డారు.

