తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల వేతనాలు 9వ తేదీ దాటినా ఇంకా వారి ఖాతాల్లో జమ కాలేదు. దీనివల్ల అనేక మంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, EMIలు చెల్లించలేకపోతున్నారు.
ఇప్పటికే కొంతమంది ఉద్యోగుల చెక్కులు బౌన్స్ కావడంతో పెనాల్టీలు పడుతున్నాయి.ఉద్యోగులు మాట్లాడుతూ –💬 “జీతాలు సమయానికి ఇవ్వకపోతే మాకు నష్టం తప్పదు. వెంటనే సమస్యను పరిష్కరించాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సెలవుల్లో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఉండటంతో వేతనాల సమస్య పరిష్కారం ఆలస్యమవుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు
అనూష

