హైదరాబాద్ :
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేశారు. “నా రాజీనామాను ఇంకా ఆమోదించలేదు.
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేరు. రాజీనామా ఆమోదిస్తే ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. నేను ఎన్నికైనప్పుడు కూడా ఆ సీటు ఆరు నెలలకు పైగా ఖాళీగానే ఉంది. అవసరమైతే మళ్లీ ఛైర్మన్‌ను కలుస్తా” అని కవిత తెలిపారు.
రాజీనామా ఆమోదంపై ఇంకా స్పష్టత లేదు
ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఆమోదం వాయిదా
అవసరమైతే మళ్లీ ఛైర్మన్‌ను కలుసుకుంటానని కవిత వ్యాఖ్య

