Tv424x7
Andhrapradesh

డీప్‌ఫేక్ మోసాలకు ‘సేఫ్ వర్డ్’.. సజ్జనార్ కీలక సూచన

హైదరాబాద్:టెక్నాలజీ ఆధారిత మోసాలు రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో, డీప్‌ఫేక్ స్కామ్‌లపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో కుటుంబ సభ్యుల ముఖం, గొంతును క్లోన్‌చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న నేరగాళ్లు పెరుగుతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి మోసాలనుంచి రక్షణ పొందడానికి ‘సేఫ్ వర్డ్’ (రహస్య పదం) ఏర్పాటు చేసుకోవడం అత్యంత సమర్థవంతమైన మార్గమని సజ్జనార్ సూచించారు.

మోసం చేసే విధానంసైబర్ నేరగాళ్లు మనకు తెలిసిన వారి ఫోటోలు, వీడియోలు సేకరించి వాటిని ఏఐ సాయంతో రియలిస్టిక్‌గా మార్చి వీడియో లేదా ఆడియో కాల్స్ చేస్తారని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నట్టు నటించి డబ్బు కోరడం ఈ మోసాల లక్షణమని వివరించారు.

పై-ల్యాబ్స్’ నివేదిక ప్రకారం, ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా డీప్‌ఫేక్ మోసాల వల్ల ₹70,000 కోట్లకు పైగా నష్టం సంభవించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

‘సేఫ్ వర్డ్’ ఎలా పనిచేస్తుంది?

కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు ముందుగానే ఒక రహస్య పదం నిర్ణయించుకోవాలని సూచించారు.

ఎవరైనా డబ్బు అడిగే కాల్ వస్తే, ముందుగా ఆ ‘సేఫ్ వర్డ్’ చెప్పమని అడగాలి.

వారు సరైన పదం చెప్పలేకపోతే, అది డీప్‌ఫేక్ మోసం అని అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు.

సజ్జనార్ హెచ్చరికతెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దు.రూపం, స్వరం చూసి నమ్మకండి.

డబ్బులు పంపే ముందు వాస్తవాలను నిర్ధారించుకోండి.

మోసపోయినా లేదా అనుమానం వచ్చినా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయండి

Related posts

జీవీఎంసీ కమిషనర్ ను కలిసిన గండి బాజ్జీ

TV4-24X7 News

ఏపీలో నాలా చట్టం రద్దు …

TV4-24X7 News

విశాలాంధ్ర ప్రచరణ పుస్తకాల పఠనం తోనే విజ్ఞానం ఏయూ మాజీ వీసీ డాక్టర్ జిఎస్ఎన్ రాజు

TV4-24X7 News

Leave a Comment