Tv424x7
Andhrapradesh

సోంపల్లిలో జూదంపై పోలీసుల దాడులు.. 11 మంది అరెస్ట్

కడప /ముద్దనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సోంపల్లి గ్రామంలో ఈ రోజు నమ్మకమైన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా “లోపలా–బయటా” పేరుతో జూదం ఆడుతున్న వారిపై చర్యలు చేపట్టారు.దాడుల సందర్భంగా మొత్తం 11 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.33,800 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 44/2026 కింద, A.P. Gaming Act సెక్షన్ 9(1) ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ముద్దనూరు యూ/జీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

Related posts

ఆ విషయంలో సీఎం జగన్ ను అభినందించాలి: లక్ష్మీనారాయణ

TV4-24X7 News

కడపలో టూవీలర్లపై ఎస్పీ ఉక్కుపాదం!!

TV4-24X7 News

పార్లమెంటు నే కాపాడలేని ప్రభుత్వం దేశాన్నేమి కాపాడుతుంది :- నారాయణ CPI

TV4-24X7 News

Leave a Comment