ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పెంపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏ4 మద్యం దుకాణాల లైసెన్స్‌ల రెన్యువల్ గడువును ప్రభుత్వం మరో రెండు రోజులు పొడిగించింది. మద్యం దుకాణాల యజమానుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దీంతో రెన్యువల్‌కు సెప్టెంబర్ 23 వరకు అవకాశం కల్పించారు.
2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 3,650 ఏ4 మద్యం దుకాణాలను నోటిఫై చేశారు. రెన్యువల్, వార్షిక రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (RET), పర్మిట్ రూమ్ RET కలిపి ప్రభుత్వానికి రూ.3,637.35 కోట్ల వార్షిక డిమాండ్ ఉంది. సెప్టెంబర్ 21 నాటికి మొత్తం రూ.1,179.63 కోట్లు వసూలైనట్లు అధికారులు వెల్లడించారు.
రెన్యువల్, దరఖాస్తు రుసుముల కింద రూ.933.44 కోట్ల డిమాండ్ ఉండగా రూ.676 కోట్లు వసూలయ్యాయి. వార్షిక RET కింద రూ.2,454.76 కోట్ల డిమాండ్‌కు రూ.441 కోట్లు, పర్మిట్ రూమ్ RET కింద రూ.249.15 కోట్ల డిమాండ్‌కు రూ.62 కోట్లు వసూలైనట్లు తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి.
రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేయని దుకాణాలకు తదుపరి దశలో కొత్త దరఖాస్తులు స్వీకరించి లాటరీ ద్వారా కేటాయించే ప్రక్రియ ఉంటుందని ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ప్రకటించింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: