‘డి’ కేటగిరీ ఫ్యాక్షన్ గ్రామంలో పోలీసుల పల్లె నిద్ర
పెద్దముడియం: జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జమ్మలమడుగు రూరల్ సీఐ శ్రీ కుళ్లాయప్ప, పెద్దముడియం ఎస్‌ఐ శ్రీ సుబ్బారావు కలిసి పెద్దముడియం మండలంలోని ‘డి’ కేటగిరీ ఫ్యాక్షన్ గ్రామంగా పేర్కొన్న నెమళ్లదిన్నె గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా పోలీసులు గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించి, ప్రజలకు పోలీసుల తరఫున భద్రతా భరోసా కల్పించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం, ప్రజల్లో భద్రతా భావాన్ని మరింత పెంపొందించడం లక్ష్యంగా సీఐ కుళ్లాయప్ప, ఎస్‌ఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలోనే రాత్రి బస (పల్లె నిద్ర) చేపట్టారు.
గ్రామంలో పోలీసుల రాత్రి బసతో ప్రజలకు భద్రతపై మరింత నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: