బి.కోడూరు మండలంలో అంగన్వాడీ టీచర్లకు ఘన సన్మానం
బి.కోడూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బి.కోడూరు అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ శ్రీదేవి, సూపర్వైజర్ సుగుణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను ఘనంగా సన్మానించారు.
మండల అధ్యక్షుడు పోలుబోయిన రవిచంద్ర, కడప జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి మున్నెల్లి చిన్నగురయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను నాయకులు అభినందించారు.
చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ఎదుగుదలతో పాటు విద్యాభివృద్ధిలో అంగన్వాడీ టీచర్ల పాత్ర ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడం, చిన్నారుల ఎదుగుదలను పర్యవేక్షించడం, విద్యకు పునాది వేయడం వంటి కార్యక్రమాలను సిబ్బంది సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు, కడప జిల్లా ఉపాధ్యక్షుడు తిప్పలూరు రామసుబ్బారెడ్డి, BLA-1 మరియు బి.కోడూరు మండల ఇంచార్జ్ బిజివేముల భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
అలాగే బి.కోడూరు మండల అధ్యక్షుడు పోలుబోయిన రవిచంద్ర, కడప జిల్లా ఓబీసీ కార్యదర్శి మున్నెల్లి చిన్నగురయ్య, బద్వేల్ రూరల్ మండల అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు సుధాకర్‌రెడ్డి, కడప జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు గాజులపల్లి శివారెడ్డి, మౌనిక, కేశవరెడ్డి, మంజుల రామకృష్ణ, దొమ్మర శ్రీను, వంకదారి జయరామ్, నుస్సుం గురప్ప తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ సిబ్బంది సేవలను గుర్తించి వారిని సన్మానించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: