కడప: నగరంలోని అలంఖాన్‌పల్లి సర్కిల్ వద్ద మంగళవారం ఓ లారీ దగ్ధమైంది. లారీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఆందోళన నెలకొంది.
ప్రమాదాన్ని గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమై వెంటనే వాహనం నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. దీంతో ఇద్దరూ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.
లారీ నుంచి మంటలు ఎగసిపడటంతో సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: