మృతుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కల్లూరు: ఇటీవల ముద్దనూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుజ్జల కృష్ణయ్య యాదవ్ కుటుంబానికి అండగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు నాగేంద్ర రెడ్డి నిలిచారు. కృష్ణయ్య యాదవ్ కుమార్తె స్నేహిత లక్ష్మి పేరుతో రూ.50 వేల మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా కల్లూరు నాగేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. స్నేహిత లక్ష్మి వివాహ సమయంలో కూడా తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు. యాదవులంతా తనకు ఆత్మబంధువులని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో యాదవ కుల పెద్దలు గంగయ్య, వేణు, సుబ్బరాయుడు, వైఎస్సార్‌సీపీ నాయకులు సుబ్రమణ్యం, బీసీ యాదవ్, చిన్న సుబ్బరాయుడు యాదవ్, నాగ సుబ్బారెడ్డి, ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *