కేజీ ఉల్లి రూ.35కే.. రేపటి నుంచి రైతుబజార్లలో విక్రయాలు
అమరావతి: ఉల్లి ధరలు కిలో రూ.60–70 వరకు చేరడంతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీపై ఉల్లిని అందుబాటులోకి తీసుకురానుంది. రేపటి నుంచి కిలో ఉల్లిని రూ.35కే రైతుబజార్లలో విక్రయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
విజయవాడలోని ఏపీఐఐసీ రైతుబజార్‌లో ఈ విక్రయాల కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్క కుటుంబానికి గరిష్ఠంగా 2 కిలోల ఉల్లిని రాయితీ ధరకు అందించనున్నారు.
తొలుత నగరాల్లోని రైతుబజార్లలో ఈ విక్రయాలను ప్రారంభించి, అనంతరం దశలవారీగా ఇతర పట్టణాల్లోని రైతుబజార్లకు కూడా విస్తరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉల్లి ధరలు పెరిగిన సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: