వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా గూడూరు మహమ్మద్ దస్తగిరి

మైదుకూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా గూడూరు మహమ్మద్ దస్తగిరికి పార్టీ గుర్తింపు కార్డు అందజేశారు. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి చేతుల మీదుగా పార్టీ జారీ చేసిన గుర్తింపు కార్డును ఆయన స్వీకరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా గూడూరు మహమ్మద్ దస్తగిరి మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ కార్యక్రమాలు మరియు విధానాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *