అమరావతి :-సీనియర్ పాత్రికేయులు బి.మురళీధర్ రెడ్డి మృతికి సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ది హిందూ పత్రికతో పాటు పలు పత్రికల్లో ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీతో పాటు శ్రీలంక, పాకిస్థాన్ లో కూడా కరస్పాండెంట్ గా పని చేసిన మురళీధర్ రెడ్డి రిపోర్టింగ్ లో తనదైన ముద్ర వేశారని అన్నారు. మురళీధర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి విచారకరమని సీఎం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

previous post