Tv424x7
National

ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లుకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక బిల్లు ఇది.ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది చట్ట రూపం దాలిస్తే, దేశవ్యాప్తంగా, ఒకేసారి లోక్ సభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ బిల్లును ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.*_ఒకే సారి అన్ని ఎన్నికలు_*ఈ బిల్లును రూపొందించడానికి ముందు జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇటీవల తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత కొన్నాళ్లుగా ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ అనే ప్రతిపాదనను ముందుకు తెస్తోంది.

Related posts

భూకంపం సమయంలో నర్సుల వీరోచితం..

TV4-24X7 News

భర్త హత్యకు భార్య పన్నాగం – ప్రియుడి సహకారం, చివరికి విఫలం.

TV4-24X7 News

దలైలామా సోదరుడు గ్యాలో తొండప్ కన్నుమూత

TV4-24X7 News

Leave a Comment