నిన్న పశ్చిమ బెంగాల్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలతో ఆసుపత్రుల్లో కూడా ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
అయితే అస్సాం నాగావ్ ఆసుపత్రి నర్సులు అప్రమత్తంగా స్పందించి ఐసీయూలోని శిశువులను రక్షించారు. భవనం కంపిస్తున్నా, ఆపదలోనూ వారు భయపడకుండా పిల్లలను ఎత్తుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నర్సుల ధైర్యం, మానవత్వాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
“ప్రాణాలకు మించి మానవత్వం” అని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి

