Tv424x7
Andhrapradesh

విజయవాడ వేదికగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు!

అమరావతి: సినీ, రాజకీయ రంగ ప్రముఖులుమహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నేడు విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దిగ్గజ డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో 1949లో వచ్చిన మనదేశం సినిమా తో ఎన్టీఆర్ నటుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం విడుదలై 75 సంవ త్సరాలు పూర్తయిన నేప థ్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్టీఆర్ కుమారులు నందమూరి మోహనకృష్ణ, జయకృష్ణతో పాటు సినీ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఈ వేడుకల్లో పాల్గొంటారని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ‘తారకరామం.. అన్నగారి అంతరంగం’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా లైవ్‌లింక్‌ అందుబాటులో ఉంటుందని జనార్దన్ తెలిపారు. రామకృష్ణ మాట్లాడుతూ రాజకీయాలు, సినీరంగంలో ఎన్టీఆర్ ఒక ధ్రువతార అని, సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఆయన పేరు ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ జీవిత చరిత్రను భావితరాలకు పాఠ్యాంశంగా పొందుపర చనున్నట్టు జనార్దన్ తెలిపారు

Related posts

నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ

TV4-24X7 News

అదనపు కట్నం వేధింపులు… గర్భిణీ మహిళ ఆత్మహత్య..

TV4-24X7 News

భారీగా తగ్గిన ఇళ్ల అమ్మకాలు.. విశాఖపట్నంకు భారీ ఎదురుదెబ్బ.. ఏకంగా 37 శాతం డౌన్

TV4-24X7 News

Leave a Comment