కడప యోగివేమన విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ పాలనా శాస్త్రం పరిశోధకుడు గొల్లపల్లి ప్రసాద్ రావుకు విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రకటించింది. ఆచార్య జి.పార్వతీ పర్యవేక్షణలో ‘పెర్ఫామెన్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇన్ వైఎస్సార్ కడప డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అనే అంశంపై పరిశోధన చేశారు. వైవీయూ సీఈ ఆచార్య కృష్ణారావు నోటిఫికేషన్ జారీ చేశారు.

