Tv424x7
Andhrapradesh

పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

అమరావతి:పల్నాడు జిల్లా, ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి గంగమ్మ, సామ్రాజ్యం, మాధవి, పద్మ అనే నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.

Related posts

కాలేజ్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య కారణమేంటి..?

TV4-24X7 News

కాంగ్రెస్ లో చేరనున్న మాజీ మంత్రి..?

TV4-24X7 News

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా పోలు రామమోహన్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment