Tv424x7
Andhrapradesh

కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

▪️సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ ప్రాతిపదికన 103 ఖాళీలు భర్తీ.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్నకెరీర్ అండ్ మెంటర్ హెల్త్ కౌన్సిలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 103 పోస్టలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ వరకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతలు, జీత భత్యాలు ఇలా.. కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎమ్మెస్సీ, ఎంఏ సైకాలజీ చేసి ఉండాలి, లేదా డిగ్రీలో సైకాలజీ ప్రధాన సబ్జెక్టుగా కచ్చితంగా చదివి ఉండాలి. వయసు 45 సంవత్సరాలలోపు ఉండాలి. అర్హత ఉన్న వారు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని ప్రకటించారు. జీతం రూ.30 వేలు ఉంటుందని, కాంట్రాక్టు పద్దతిలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరం అనగా జూన్-2025 నుంచి 10 నెలల పాటు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సమగ్రశిక్ష అవసరాల మేరకు కాంట్రాక్టును కొనసాగించనున్నారు.

Related posts

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..

TV4-24X7 News

మళ్లీ టీడీపీలోకి మాజీ నేతలు

TV4-24X7 News

మాజీమంత్రి విడుదల రజనికి జైలు శిక్షా.?

TV4-24X7 News

Leave a Comment