Tv424x7
Andhrapradesh

ప్రొద్దుటూరులోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్డులో అన్నదమ్ముల పిల్లలు అదృశ్యం

ప్రొద్దుటూరులోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్డుకు చెందిన అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు అదృశ్యమయ్యారు

సoబటూరు వెంకటరమణ కుమారుడు వెంకటదర్శన్ ఇటీవలే 10 వ తరగతి పరీక్షలు రాశాడు.

ఇంట్లో రూ.500 కనిపించలేదని దర్శన్ ను తల్లిదండ్రులు మందలించారు దీంతో దర్శన్ ఇంటినుంచి వెళ్లిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత అదే వీధిలో ఉంటున్న తన చిన్నాన్న ఇంటికి వెళ్ళాడు. అక్కడే తన చిన్నాన్న కుమారుడు లక్ష్మణ్ తో కలసి కొంత సేపు ఆడుకున్నాడు.

ఈ క్రమంలో ఇద్దరూ కలసి ఇంట్లో చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయారు.

ఇరువురి కుటుంబ సభ్యులు పట్టణంలో, బంధువుల ఊళ్లలో గాలించినా వారి ఆచూకీ తెలియలేదు.

ఈ క్రమంలో వెంకటరమణ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిల్లలిద్దరూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.పిల్లల ఆచూకీ తెలిసిన వారు వన్ టౌన్ పోలీసులకు ( ఫోన్ నంబర్ 9121100587)సమాచారం అందించాలని ఎస్ఐ. సంజీవరెడ్డి తెలిపారు.

Related posts

సూర్య భాయ్ దెబ్బకు… పాక్ కెప్టెన్ మైండ్ దొబ్బింది!

TV4-24X7 News

పెర్ణి నాని సీఐపై బెదిరింపు: రాజకీయ ఉద్రిక్తత

TV4-24X7 News

భూమి కాజేయాలనే దౌర్జన్యం ఆపకపోతే తీవ్ర పోరాటం – వాల్మీకి సేవాదళ్

TV4-24X7 News

Leave a Comment