Tv424x7
Andhrapradesh

సూర్య భాయ్ దెబ్బకు… పాక్ కెప్టెన్ మైండ్ దొబ్బింది!

భారత్-పాకిస్తాన్ మధ్య ఆసియా కప్‌ 2025లో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ నేపథ్యంలో రెండు దేశాల మధ్య జరిగిన ఇదే తొలి మ్యాచ్.

ఈ మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను కేవలం 127 పరుగులకే కట్టడి చేసి, సులభంగా గెలుపొందింది.

టాస్‌ సమయంలోనే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో కరచాలనం చేయకపోవడం మ్యాచ్‌కు హైలైట్‌గా మారింది. చివరికి విక్టరీ సిక్స్ బాదిన సూర్య జట్టును విజయతీరాలకు చేర్చాడు.

విజయం అనంతరం కూడా టీమిండియా ఆటగాళ్లు పాక్‌ జట్టుతో కరచాలనం చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. దీంతో సల్మాన్ అఘా, పాక్ కోచ్ మైక్ హెస్సన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిరాశతో సల్మాన్ ప్రెజెంటేషన్‌కు కూడా హాజరుకాలేదు.

ప్రెజెంటేషన్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కుల్దీప్ యాదవ్, కెప్టెన్ సూర్య ఇంటర్వ్యూలతో వేడుక ముగిసింది. ఈ సందర్భంగా సూర్య పహల్గామ్ బాధితులను గుర్తుచేసి, భారత సైన్య ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తూ, విజయాన్ని వీరజవాన్లకు అంకితం చేశాడు.

Related posts

బైరెడ్డి సిద్ధార్థ్‌కు కీలక బాధ్యతలు కట్టబెడుతున్న సీఎం జగన్..!!

TV4-24X7 News

డ్రంకన్ డ్రైవ్. తనిఖీ చేపడుతున్న ఎస్ఐ విశ్వనాధ్

TV4-24X7 News

నేటి నుంచి అమల్లోకి UPI కొత్త రూల్స్!!

TV4-24X7 News

Leave a Comment