Tv424x7
Andhrapradesh

భూమి కాజేయాలనే దౌర్జన్యం ఆపకపోతే తీవ్ర పోరాటం – వాల్మీకి సేవాదళ్

అనంతపురం :

వాల్మీకి సేవాదళ్ పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తాడిపత్రి కుల్లాయమ్మకు చెందిన గుత్తి–అనంతపురం హైవే రోడ్డులోని సర్వే నంబర్లు 164C, 165C లో ఉన్న 2 ఎకరాలు 80 సెంట్ల భూమిని మాసినేని రామయ్య, తన సోదరుడి కుమారుడు అమరేంద్ర దౌర్జన్యంగా గత ప్రభుత్వ కాలంలో ఆన్లైన్లో ఎక్కించుకున్నారని ఆరోపించారు. ఒకరి పేరుపై రిజిస్టర్ ఉన్న భూమిని మరొకరి పేరుతో ఎలా ఎక్కించగలిగారని ప్రశ్నించారు.

పేద వాల్మీకి కుటుంబాల భూములను బడా బాబులు ఆర్థిక బలం, రాజకీయ పలుకుబడులను వాడుకొని కాజేయడం అన్యాయమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. కొల్లాయమ్మ కుటుంబ సభ్యులను బెదిరిస్తూ భూమి నుంచి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్వో అధికారులు వెంటనే జోక్యం చేసుకొని పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కోర్టు తీర్పులు కూడా తమకు అనుకూలంగా రాకపోయినా, అధికారులను లంచాలతో మేనేజ్ చేసి కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించాలనే ప్రయత్నం జరుగుతోందని బుల్లెట్ లింగమయ్య ఆరోపించారు. న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా వాల్మీకులను ఏకం చేసి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో వాల్మీకి సేవాదళ్ చిన్న, భార్గవ, నారాయణస్వామి, చంద్ర, భార్గవి లక్ష్మీదేవి, రామాంజినమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేద విద్యార్థి ఫీజుకి వాసుపల్లి 5 వేలు ఆర్థిక సాయం

TV4-24X7 News

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత

TV4-24X7 News

పండుగపూట విషాదం

TV4-24X7 News

Leave a Comment