Tv424x7
Andhrapradesh

తల్లికి వందనం జులై 5న చెల్లింపు

G.O.26 & 27 ప్రకారం ఈరోజు రు.15000/- ఆర్థిక సహాయంను 1 నుంచి 12 వరకు గుర్తింపు పొందిన Govt/Pvt Aided/Pvt Unaided పాఠశాలల్లో చదువుచున్న పిల్లలు గల BPL Familyలోని తల్లుల ఖాతాలలోకి విద్యార్థికి ప్రభుత్వం ₹13000/- చొప్పున నికర జమచేస్తుంది. ఒక విద్యార్థి ఇచ్చే ₹15000/-లలో రు.2000/-లను పాఠశాల మెయిన్టెనెన్స్ కు మినహాయించి మిగతా ₹13000/- తల్లి బ్యాంకు ఖాతాలోకి జమవుతుంది.

2025-26 విద్యా సంవత్సరం నుంచే ఆరంభం.

2025-26 విద్యా ఏడాదిలో హాజరుతో సంబంధం లేకుండా చెల్లించబడును.

2025-26లో 75% హాజరు ఉన్నవారికే 2026-27 ‘తల్లికి వందనం’కు అర్హులు.

కుటుంబంలో ఒకరికైనా White Ration Card ఉండాలి. UDiseలో Dataను Head of the Institution వారు కరక్ట్ అని Ensure చేయాలి.

పిల్లల తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ల ఆధార్ నెంబర్లు వాలిడేట్ అయి ఉండాలి.

Total House hold Monthly Income గ్రామాలలో ₹10,000/- & పట్టణాలలో ₹12,000)- మించరాదు. మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించరాదు. పట్టణాలలో అయితే 1000 చ.అ స్ధలము ఉండరాదు. House Hold Membersలో ఏ ఒక్కరికీ 4 Wheeler ఉండరాదు.

సరాసరి నెలకు 300 యూనిట్ల మించి విద్యుత్ వినియోగం ఉండరాదు.

House Hold Member ఆదాయపు పన్ను చెల్లించే వారు ఈ పథకానికి అనర్హులు.

ఫీజు రీయంబర్స్మెంట్ సదుపాయం ఉన్న IIIT, Poly Technic కోర్సుల్లో చదివే పిల్లల తల్లులు అనర్హులు.

2025-26 విద్యా సంవత్సరంనకు 1 నుంచి 12 తరగతులలో ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ ఆర్థిక సాయం పరిశీలించబడును.

RTE ACT-12(1)(c) కింద Private Schoolsలో చేరిన వారికి ఆయా పాఠశాలల యాజమాన్యాలకు SPD ద్వారా ఫీజు కింద టీవీ అందిస్తారు, మిగిలిన ఫీజు RTE Act ప్రకారం చెల్లింపు జరుగును.

తల్లి లేకపోతేనే తండ్రికి, ఇద్దరూ లేకపోతే ఆధార్ గార్డియన్కు చెల్లించబడును. అనాథ బాలలకు జిల్లా కలెక్టర్ ద్వారా చెల్లించబడును.

G.O.27లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం జూన్ 12 నుంచి 28వరకు అర్హులైన తల్లులు/తండ్రులతో విద్యార్థుల జాబితా తయారుచేసి 1 నుంచి ఇంటర్ వరకు చదువుచున్న అర్హులైన విద్యార్థుల తుది జాబితాను ఈ నెలాఖరులోగా గ్రామ/వార్డు సచివాలయాలలో ప్రదర్శిస్తారు.

జులై 5న తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాలకు జమగును.

Related posts

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు

TV4-24X7 News

హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదు: సునీత

TV4-24X7 News

చైతన్య మరియు స్కూల్ జోన్లు ఉన్నచోట బ్రేక్ కట్టలు జిబ్రా క్రాసింగ్లు ఏర్పాటు చేయాలని విద్యార్థి యువజన సంఘాల డిమాండ్

TV4-24X7 News

Leave a Comment