Tv424x7
Andhrapradesh

ఏపీలోని ట్రిపుల్ ఐటీల్లో భారీగా మిగిలిన సీట్లు

అమరావతి :ఏపీ రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. కౌన్సెలింగ్ అనంతరం నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 598 సీట్లు మిగిలాయి. ఒక్కో ట్రిపుల్ఎటీలో 1,010 సీట్లు ఉండగా, నూజివీధిలో 139, ఇడుపులపాయలో 132, శ్రీకాకుళంలో 144, ఒంగోలులో అత్యధికంగా 183 సీట్లు మిగలడం గమనార్హం. ఈ సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 14 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా 15 రోజులు ఆలస్యం కావడం వల్ల చాలా మంది పాలిటెక్నిక్, ఇంటర్ కాలేజీల్లో చేరిపోయి ఉంటారని భావిస్తున్నారు. కాగా సీట్లు పొందిన వారికి ఈ నెల 14 నుండి తరగతుల ప్రారంభమవుతాయని రిజిస్ట్రార్ తెలిపారు…..

Related posts

కుటుంబ సమేతంగా నాగులచవితి పండుగ మహోత్సవంలో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

ఏపీలో ఇకపై ఇద్దరికి మించి పిల్లలున్న వారూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులే

TV4-24X7 News

సీఐ జి.డి బాబు ని కలిసిన కొల్లి సింహాచలం

TV4-24X7 News

Leave a Comment