Tv424x7
Andhrapradesh

గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో ప్రమాదాలపై ఏపీ సిఎం చంద్రబాబు విచారం

వేరు వేరు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న సిఎం

గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం

నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాల్లో జరిగిన ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆవేదన చెందారు.పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుతాళ్ళ గ్రామంలో గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గణేష్ విగ్రహ ఊరేగింపులో ట్రాక్టర్ దూసుకుపోయిన ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయాల పాలయ్యారు.ఎంతో సంతోషంగా వేడుక జరుపుకుంటున్న వారు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు చింతలవీధి జంక్షన్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమంలో ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు వివరించారు.వారికి అందుతున్న వైద్య సహాయంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Related posts

విజయనగరం జిల్లాలో 6 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత

TV4-24X7 News

శ్రీవారి భక్తులకు తీపి కబురు.. ఇక క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు..!

TV4-24X7 News

సినిమాల్లో నటించడంపై పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

TV4-24X7 News

Leave a Comment