Tv424x7
Andhrapradesh

జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల పులివెందుల లో సార్వత్రిక మానవ విలువల కార్యక్రమం

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి వారిచే సిఫారసు చేయబడిన సార్వత్రిక మానవ విలువల కార్యక్రమం పులివెందుల జేఎన్టీయూ కళాశాలకు 5.రోజుల సార్వత్రిక మానవ విలువల కార్యక్రమం డిసెంబర్ 12.వ తేది నుండి 16.వ తేది వరకు సిఫారసు చేసి ఆమోదించారు. ఈ కార్యక్రమమునకు ఏఐసీటీఈ తరపున వినయ్ చిద్రి, కుమార్ సందవ్ బోధనా సభ్యులుగా మరియు సౌమ్య అబ్జర్వర్ గా సిఫారసు చేయబడ్డారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్స్లర్ ఆచార్య జి.రంగ జనార్ధన్ పాల్గొని ప్రసంగిస్తూ ప్రస్తుత పరిస్థితులలో సర్వ మానవ శ్రేయస్సుకు, సార్వత్రిక మానవ విలువల కోర్సు ఒక్కరికి వారి వ్యక్తిగత పరిపూర్ణతకు అవసరమని పేర్కొన్నారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సక్రమ ఎదుగుదల మనవజాతి మనుగడకు వ్యక్తిగత స్థాయి నుండి మరియు ఉన్నతికి మానవ విలువలు బాగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్వహణ అధికారిగా ఆచార్య శేష మహేశ్వరమ్మ అలాగే ఒరిస్సా,తమిళనాడు,తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక మరియు పాండిచ్చేరి నుండి 78 మంది నిష్టాతులైన ఆచార్యులు, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. సూర్యనారాయణ రెడ్డి అధ్యాపక, అధ్యాపకేత్ర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు హాజరు కానున్న సీఎం

TV4-24X7 News

మెడికల్ కళాశాలపై నిజాలు మాట్లాడితే అక్రమ అరెస్టులు చేస్తారా

TV4-24X7 News

ఏపీ క్యాబినెట్ భేటీ పలు కీలక అంశాలపై చర్చ

TV4-24X7 News

Leave a Comment