Tv424x7
Andhrapradesh

మెడికల్ కళాశాలపై నిజాలు మాట్లాడితే అక్రమ అరెస్టులు చేస్తారా

ఈరోజు అక్రమ అరెస్టు చేస్తే త్వరలో ప్రజలకు నిజాన్ని చూపిస్తాం.. వైసిపి నాయకులునంద్యాలలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేద విద్యార్థుల కోసం కృషి చేసి నంద్యాలలో మెడికల్ కళాశాలను నిర్మించారు.మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు మెడికల్ కాలేజీ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించడం చాలా బాధాకరమని వైసిపి నాయకులు పేర్కొంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు మంత్రులు మెడికల్ కాలేజీ లేదంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ అక్కడ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారని వారిని డిస్టర్బ్ చేయవద్దని పోలీసులు చెప్పడం జరుగుతున్నది. మంత్రులు ఏమో కాలేజీ లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాలేజీ ఉన్నదని మేము నిరూపిస్తామంటూ ఆక్కడికి వెళ్తుంటే అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మీరు ఎన్ని అక్రమ అరెస్టు చేసిన ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని వైసిపి నాయకులు తెలియజేశారు

Related posts

ఎన్టీఆర్ జిల్లా జేసీని కలసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

TV4-24X7 News

మామూలు మనిషిగానే జనంలోకి వస్తా: CBN

TV4-24X7 News

సీతoరాజు సుధాకర్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన విల్లూరి భాస్కర్ రావు మరియు బొత్స రాము కార్యకర్తలు

TV4-24X7 News

Leave a Comment