Tv424x7
Crime News

అల్వాల్‌లో జిమ్ యువతిపై వేధింపులు – మైనంపల్లి అనుచరుడిపై కేసు..

అల్వాల్‌లో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. జిమ్‌లో పరిచయమైన యువతిని ట్రాప్ చేసి, రూ.10 లక్షలు డిమాండ్ చేసిన మైనంపల్లి హన్మంతరావు అనుచరుడు రవి అలియాస్ రఫీపై కేసు నమోదైంది.

పోలీసుల వివరాల ప్రకారం, యువతి కారు మీద ట్రాకింగ్ డివైస్ అమర్చి, ఆమె ఆడియోలను మార్ఫింగ్ చేసినట్లు రవిపై ఆరోపణలు ఉన్నాయి. రూ.10 లక్షలు ఇవ్వాలని, స్థానిక నేతపై తప్పు ఫిర్యాదు చేయాలని యువతిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై యువతి ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రవి, అతనికి సహాయం చేసిన సోదరుడు రూపేష్, యువతి కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

గతంలో కూడా రవి పలువురు యువతులను ప్రేమ పేరుతో మోసం చేసి, ముగ్గురిని పెళ్లి చేసుకున్నట్లు, వారి ప్రైవేట్ వీడియోలు తీసి డబ్బు కోసం బెదిరించినట్లు పోలీసు విచారణలో బయటపడింది.

ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడి, స్థానిక నేతల అండతో రెచ్చిపోయిన రవి అలియాస్ రఫీపై ఇప్పుడు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Related posts

ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు

TV4-24X7 News

వీడిన బాలిక హత్యకేసు మిస్టరీ

TV4-24X7 News

రౌడీ షీటర్ పప్పీ హత్య నిందితులను పట్టుకున్న పోలీసులు

TV4-24X7 News

Leave a Comment